: చిక్కుల్లో పడ్డ సంజయ్ దత్!... గత నెలలో అదనంగా రెండు రోజులు ఇంట్లో ఉండటంతో సమస్య


బాలీవుడ్ నటుడు, ప్రస్తుతం పూణెలోని ఎరవాడ జైల్లో ఖైదీగా ఉన్న సంజయ్ దత్ తాజాగా మరో సమస్యలో ఇరుక్కున్నట్టు సమాచారం. జైలు నిబంధనలకు విరుద్ధంగా సంజూ తనకిచ్చిన సెలవుల కంటే రెండు రోజులు అదనంగా వాడుకున్నాడని మహారాష్ట్ర జైలు అధికారుల దర్యాప్తులో తేలింది. ఈ మేరకు అదనపు డైరెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్ మీరన్ బొర్వాంకర్ దర్యాప్తుకు సంబంధించిన నివేదికను ఆ రాష్ట్ర హోంశాఖ విభాగానికి అందజేశారు. గత నెలలో సంజయ్ ఆరోగ్య సమస్యల వల్ల మరో 14 రోజుల అదనపు సెలవు ఇవ్వాలని దరఖాస్తు చేసినప్పుడు ముంబయి పోలీసులు, జైలు అధికారుల మధ్య సమన్వయం లేదని, దానివలన కూడా సంజూ అలా ఇంటిలో ఉండేందుకు కారణమవ్వచ్చని నివేదికలో పేర్కొన్నారు. ఎవరైనా నిబంధనలను అతిక్రమిస్తే చర్యలు ఎదుర్కోవాల్సి ఉంటుందని బొర్వాంకర్ చెప్పారు. ఈ క్రమంలో జైలు నియమావళి ప్రకారం సంజయ్ మిగిలిన సెలవుల్లో కొన్ని రోజులను తగ్గించే అవకాశం ఉందని మరో అధికారి చెప్పారు. అంటే ఒకరోజు అదనంగా ఉంటే... నేరస్థుడి భవిష్యత్ సెలవుల్లో ఐదు రోజులు కత్తిరించేస్తారని, దత్ విషయంలో రెండు రోజులు కాబట్టి పది రోజులు తగ్గిస్తారని వివరించారు.

  • Loading...

More Telugu News