: 9999 కారు నెంబర్ ఖరీదు లక్షన్నర


న్యూమరాలజీ, ఫ్యాన్సీ నెంబర్ మోజులో వాహనం నెంబర్ కోసం ఔత్సాహికులు లక్షలు వెచ్చిస్తున్నారు. తాజాగా హైదరాబాదులోని ఆర్టీఓ కార్యాలయంలో జరిగిన ఫ్యాన్సీ నెంబర్ల వేలంలో 9999ను లక్షా యాభైవేల రూపాయలు పెట్టి మహబూబ్ నగర్ జిల్లా జడ్చర్లకు చెందిన ప్రమోదిని రెడ్డి దక్కించుకున్నారు. ఈ నెంబర్ కు ఆర్టీఓ అధికారులు 50 వేల రూపాయల ధర నిర్ణయించగా, ఇద్దరు పాల్గొన్న వేలంలో లక్షన్నర కోట్ చేసిన ప్రమోదిని రెడ్డి సొంతం చేసుకున్నారని ఆర్టీఓ తెలిపింది. కాగా, సినీ నటుడు రామ్ చరణ్ కొత్త కారు నెంబర్ 1111 కోసం లక్షా పదిహేను వేల రూపాయలను వెచ్చించిన సంగతి తెలిసిందే.

  • Loading...

More Telugu News