: 'బాబ్బాబు ఇంటికెళ్లు... ఇంటి కంటే ఆసుపత్రే బాగుంది'


చైనాలోని బీజింగ్ జిల్లాలోని మెంటావ్‌ గౌ గ్రామానికి చెందిన చెన్ (55) 2011 ఆగస్టులో ఓ రోడ్డు ప్రమాదంలో గాయపడ్డాడు. దీంతో అతనిని బీజింగ్ లోని జింగ్మీ గ్రూప్ ఆసుపత్రిలో చేర్పించారు. తరువాత నెల రోజులకు గాయాలు పూర్తిగా తగ్గాయని తేల్చిన వైద్యులు, డిశ్చార్జ్ చేశారు. ఇంటిదగ్గర రెండు నెలలున్న చెన్, ఎడమ కాలులో నొప్పి వస్తోందంటూ మళ్లీ ఆస్పత్రికి వచ్చాడు. అతడిని పరీక్షించిన వైద్యులు, అతని ఎడమకాలి రక్తనాళాల్లో కొన్ని చోట్ల రక్తం గడ్డకట్టుకుపోవడాన్ని గుర్తించారు. దీంతో ఆసుపత్రిలో చేర్చుకున్న వైద్యులు, మూడు నెలలు చికిత్స చేసి డిశ్చార్జ్ చేశారు. దానికి చెన్ నిరాకరించాడు. తానింకా పూర్తిగా కోలుకోలేదని పేర్కొంటూ ఆసుపత్రిని వీడేదిలేదని వైద్యులకు చెప్పాడు. ఆసుపత్రి బిల్లులు కూడా చెల్లించకపోవడంతో జూలై 2012 నుంచి ఆతనికి వైద్య సేవలను కూడా నిలిపేశారు. అయినప్పటికీ ఆసుపత్రిని వీడలేదు. అదే సమయంలో జరిగిన తన కుమారుడి పెళ్లికి కూడా హాజరుకాలేదు. దీంతో ఆసుపత్రి యాజమాన్యం కోర్టుకు వెళ్లింది. మానసిక వ్యాధితో బాధ పడుతున్నారా? అనేది పరిశీలించిన న్యాయస్థానం, చెన్ పూర్తి ఆరోగ్యంగా ఉన్నాడని తేలడంతో అతనిని ఇంటికి పంపించడంలో ఆసుపత్రి వర్గాలకు సహకరించాలని పోలీసులను ఆదేశించింది. దీంతో ఇంటికెళ్లడం ఇష్టం లేని చెన్ ఆసుపత్రి మంచానికి చైన్లతో తనను తాను బంధించుకున్నాడు. అతనిని అలాగే పోలీసులు ఇంటికి తరలించారు.

  • Loading...

More Telugu News