: ఢిల్లీలో ఓటమి ఆర్థిక సంస్కరణల వేగాన్ని తగ్గించదు: అరుణ్ జైట్లీ
ఢిల్లీలో బీజేపీ ఘోర పరాజయం దేశ అభివృద్ధిపై ప్రభావం పడొచ్చంటూ వస్తున్న వాదనలను కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి అరుణ్ జైట్లీ ఖండించారు. ఈ పరాజయం ఆర్థిక సంస్కరణల వేగాన్ని తగ్గించదని స్పష్టంచేశారు. ఈ మేరకు ఢిల్లీ మీడియా ప్రతినిధులతో జైట్లీ మాట్లాడారు. ఆర్థిక సంస్కరణల మార్గంలో తప్పకుండా ముందుకు వెళ్ళాలని కేంద్రం నిర్ణయంతో ఉందని తెలిపారు. దేశ ఆర్థికవ్యవస్థ ఎంతో వేగంగా ముందుకెళ్లనుందని చెప్పారు.