: ఐసీసీ వెబ్ సైట్ కు మెరుగులు


తన అధికారిక వెబ్ సైట్ కు ఐసీసీ మెరుగులు దిద్దింది. ఈ నెల 14 నుంచి వరల్డ్ కప్ మ్యాచ్ లు జరగనున్న నేపథ్యంలో, వెబ్ సైట్ ను ఆధునికీకరించింది. ఆయా పోటీల లైవ్ స్కోర్లు, గణాంకాలను ఇకపై ఐసీసీ వెబ్ సైట్ లోనూ తెలుసుకోవచ్చు. అంతేగాకుండా, క్రికెట్ అభిమానుల కోసం ప్రత్యేక యాప్ ను అందుబాటులోకి తీసుకువచ్చింది. వరల్డ్ కప్ సందర్భంగా ఫ్యాన్స్ తమ అభిమాన జట్లతో మమేకం అయ్యేందుకు కూడా ఐసీసీ తన వెబ్ సైట్ ద్వారా అవకాశం కల్పిస్తోంది. ఈ మేరకు ఐసీసీ ఓ ప్రకటన విడుదల చేసింది.

  • Loading...

More Telugu News