: టీచర్ ను కత్తితో పొడిచిన విద్యార్థి
వ్యసనాల బారిన పడని వ్యక్తులుగా తీర్చిదిద్దడమే కర్తవ్యంగా భావించిన ఓ ఉపాధ్యాయుడు కత్తిపోట్లకు గురయ్యాడు. మేఘాలయ రాజధాని ఇంఫాల్ లోని జవహర్ నవోదయ విద్యాలయంలో 12వ తరగతి చదువుతున్న విద్యార్థి స్కూలు ఆవరణలో మద్యం సేవిస్తుండగా, అదే స్కూలులో ఆ విద్యార్థికి పాఠాలు చెప్పే ఉపాధ్యాయుడు అలెక్స్ పమ్మి మందలించాడు. దీంతో ఆగ్రహం చెందిన విద్యార్థి కత్తితో దాడి చేశాడు. ఐదు కత్తి పోట్లు తిన్న పమ్మిని ఆసుపత్రిలో చేర్చగా, ఇంటెన్సివ్ కేర్ యూనిట్ లో చికిత్స పొందుతున్నారు. కాగా, విద్యార్థి పరారీలో ఉన్నాడు. కేసు నమోదు చేసిన పోలీసులు విద్యార్థి కోసం గాలింపు మొదలు పెట్టారు.