: ఏఐసీసీలో ప్రక్షాళన జరగనుంది: ఎమ్మెల్సీ పొంగులేటి


ఏప్రిల్ నెలలో ఏఐసీసీ సమావేశాలు జరుగుతాయని... ఆ సమావేశాల్లో వివిధ రాష్ట్రాల ఎన్నికల ఫలితాలపై సమీక్ష ఉంటుందని ఆ పార్టీ ఎమ్మెల్సీ పొంగులేటి సుధాకర్ రెడ్డి వెల్లడించారు. ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల ఫలితాలపై కాంగ్రెస్ పార్టీ ఆత్మ పరిశీలన చేసుకుంటోందని చెప్పారు. ఏఐసీసీలో కూడా ప్రక్షాళన జరుగుతుందని అన్నారు. తెలంగాణలో కాంగ్రెస్ పరిస్థితిపై కూడా చర్చ జరుగుతుందని తెలిపారు. తెలంగాణకు న్యాయబద్ధంగా రావాల్సిన నీరు, విద్యుత్ వాటాలపై ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు మాట్లాడాలని... లేకపోతే తెలంగాణ ప్రజలు హర్షించరని చెప్పారు. ఈ అంశాలపై వివరణ ఇచ్చిన తర్వాత తెలంగాణలో పర్యటిస్తే బాగుంటుందని సూచించారు.

  • Loading...

More Telugu News