: వరల్డ్ కప్ ఆరంభ వేడుకలు షురూ
ఐసీసీ వరల్డ్ కప్-2015 ఆరంభమైంది. న్యూజిలాండ్ లోని క్రైస్ట్ చర్చ్ హాగ్లే పార్క్ ఓవల్ లో వేడుకలు షురూ అయ్యాయి. వరల్డ్ కప్ ప్రారంభమైనట్టు న్యూజిలాండ్ ప్రధాని జాన్ కీ అధికారికంగా ప్రకటించారు. భారత కళాకారులు తమ సాంస్కృతిక ప్రదర్శనలతో వీక్షకులను అలరించారు. ఐరిష్ సింగర్లు, బ్రిటీష్ బాలే డాన్సర్లు, ఆఫ్ఘన్, బంగ్లాదేశీ కళాకారులు ఆకట్టుకున్నారు. ఈ వేడుకల్లో పలు జట్ల ఆటగాళ్లు పాల్గొన్నారు. ఆయా జట్ల అభిమానులు ఓవల్ లో సందడి చేశారు. టోర్నీ ప్రారంభోత్సవంలో న్యూజిలాండ్ ప్రధాని జాన్ కీ మాట్లాడుతూ, అన్ని జట్లకు బెస్టాఫ్ లక్ చెప్పారు. న్యూజిలాండ్ జట్టుకు కాస్త ఎక్కువ అదృష్టం కలిసిరావాలని కోరుకుంటున్నట్టు చెప్పి, అందరినీ నవ్వించారు. అటు, ఆస్ట్రేలియాలోని మెల్బోర్న్ లోనూ వరల్డ్ కప్ ప్రారంభోత్సవ వేడుకలు ఆరంభం అయ్యాయి. ప్రఖ్యాత గాయకులు తమ గానమాధుర్యంతో క్రికెట్ అభిమానులను ఉర్రూతలూగిస్తున్నారు. ఈ టోర్నీకి ఆస్ట్రేలియా, న్యూజిలాండ్ సంయుక్తంగా ఆతిథ్యమిస్తున్న సంగతి తెలిసిందే.