: కోదండరామ్ కు టీఆర్ఎస్ ప్రాధాన్యత ఇవ్వడం లేదు... మండిపడ్డ కిషన్ రెడ్డి


టీఆర్ఎస్ ప్రభుత్వం కేవలం హామీలకే పరిమితమైందని... చేతల్లో మాత్రం ఏమీ లేదని బీజేపీ తెలంగాణ అధ్యక్షుడు కిషన్ రెడ్డి ఆరోపించారు. టీడీపీ అధినేత చంద్రబాబు వరంగల్ పర్యటనను అడ్డుకుంటామన్న టీఆర్ఎస్ నేతలను ఉద్దేశించి మాట్లాడుతూ, ప్రజాస్వామ్యంలో ఎవరు ఎక్కడైనా తిరగవచ్చని అన్నారు. అయితే విద్యుత్ విషయంలో టీడీపీ కూడా స్పష్టత ఇవ్వాల్సిన అవసరం ఉందని చెప్పారు. తెలంగాణ కోసం పోరాడిన వ్యక్తుల్లో టీజేఏసీ ఛైర్మన్ కోదండరామ్ అత్యంత ప్రముఖుడని... అలాంటి వ్యక్తికి టీఆర్ఎస్ ప్రభుత్వం ప్రాధాన్యత ఇవ్వడం లేదని మండిపడ్డారు. ఇప్పటివరకు తెలంగాణలో 16 లక్షల పార్టీ సభ్యత్వాలు నమోదయ్యాయని వెల్లడించారు.

  • Loading...

More Telugu News