: ‘పబ్లిక్ సర్వీస్ కమిషన్’లో ఫైళ్ల గోల... కార్యాలయం ముందు టీపీఎస్సీ ఉద్యోగుల ధర్నా


హైదరాబాదులోని తెలుగు రాష్ట్రాల పబ్లిక్ సర్వీస్ కమిషన్ కార్యాలయాలున్న భవనంలో కొద్దిసేపటి క్రితం ఫైళ్ల గోల మొదలైంది. తమకు సంబంధించిన ఫైళ్లను ఏపీపీఎస్సీ అధికారులు ఇవ్వడం లేదంటూ భవనం ముందు తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ ఉద్యోగులు ధర్నాకు దిగారు. తమ ఫైళ్లు తమకివ్వడానికి ఎపీపీఎస్సీ ఉద్యోగులకొచ్చిన ఇబ్బందేమిటని వారు ఆవేదన వ్యక్తం చేశారు. సాయంత్రంలోగా సంబంధిత ఫైళ్లను తమకు అప్పగించాల్సిందేనని వారు హుకుం జారీ చేశారు. లేని పక్షంలో ఆందోళనను తీవ్రతరం చేస్తామని, ఏపీపీఎస్సీ అధికారుల కార్యాలయాలకు తాళాలు వేయడానికి కూడా వెనుకాడబోమని వారు హెచ్చరించారు.

  • Loading...

More Telugu News