: ఎమ్మార్పీఎస్ కార్యకర్తలపై దాడులకు చంద్రబాబే బాధ్యత వహించాలి: టీఆర్ఎస్


ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు పర్యటన నేపథ్యంలో వరంగల్ జిల్లాలో ఎమ్మార్పీఎస్ కార్యకర్తలపై దాడులు జరిగాయని, ఆ దాడులను ఖండిస్తున్నామని టీఆర్ఎస్ పేర్కొంది. దాడులకు చంద్రబాబు, ఎర్రబెల్లి దయాకర్ రావు బాధ్యత వహించాలని టీఆర్ఎస్ నేతలు పెద్దిరెడ్డి సుదర్శన్ రెడ్డి, ఎర్రోళ్ల శ్రీనివాస్ తదితరులు డిమాండ్ చేశారు. ఉప్పల్ నుంచి వరంగల్ వరకు పలు ప్రాంతాల్లో దాడులు జరిగాయని అన్నారు. కాగా, వరంగల్ జిల్లా పర్యటనలో ఉన్న చంద్రబాబు జనగామ చేరుకున్నారు. అక్కడ ఆయనకు కార్యకర్తలు ఘనంగా స్వాగతం పలికారు.

  • Loading...

More Telugu News