: జమ్మికుంటలో సీబీఐ సోదాల కలకలం... పత్తి కొనుగోలుదారుల ఇళ్లలో తనిఖీలు
కరీంనగర్ జిల్లా జమ్మికుంటలో నేటి ఉదయం సీబీఐ అధికారుల సోదాలు కలకలం రేపాయి. పట్టణంలోని కాటన్ మార్కెట్ తో పాటు పత్తి వ్యాపారుల ఇళ్లలో సీబీఐ అధికారులు ఏకకాలంలో సోదాలు చేపట్టారు. ఎలాంటి నోటీసులు లేకుండా ఒక్కసారిగా సీబీఐ అధికారులు రంగప్రవేశం చేయడంతో అటు పత్తి వ్యాపారులతో పాటు ఇటు కాటన్ కార్పోరేషన్ ఆప్ ఇండియా(సీసీఐ) అధికారులు తీవ్ర ఆందోళనలో కూరుకుపోయారు. 2004-07 మధ్య కాలంలో సీసీఐ చేపట్టిన పత్తి కొనుగోళ్లలో అవకతవకలు జరిగాయని ఆరోపణలు వచ్చాయి. సదరు ఆరోపణలపై దర్యాప్తులో భాగంగానే సీబీఐ నేడు జమ్మికుంటలో సోదాలు చేపట్టారు.