: ఢిల్లీలో కాంగ్రెస్ ఓటమికి కారణం అజయ్ మాకెనే: షీలా దీక్షిత్


ఢిల్లీ ఎన్నికల్లో పార్టీ ఘోర పరాజయంపై కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత, ఢిల్లీ మాజీ ముఖ్యమంత్రి షీలా దీక్షిత్ ఘాటుగా స్పందించారు. ఎన్నికల్లో పార్టీ బాధ్యతలను భుజానికెత్తున్న అజయ్ మాకెన్ కారణంగానే పార్టీకి రిక్త హస్తం మిగిలిందని ఆమె ఆరోపించారు. కొద్దిసేపటి క్రితం మీడియాతో మాట్లాడిన ఆమె, ఎన్నికల్లో పార్టీ ఓటమి తర్వాత అజయ్ మాకెన్ కాంగ్రెస్ కు రాజీనామా చేయడాన్ని తప్పుబట్టారు. ఎన్నికల్లో పార్టీని ముందుకు నడిపించాల్సిన అజయ్ మాకెన్, ఉదాసీనంగా వ్యవహరించారని, ఒక్క రోజు కూడా తనను ప్రచారానికి పిలవలేదని ఆమె విరుచుకుపడ్డారు.

  • Loading...

More Telugu News