: ఆర్టీఏ కార్యాలయంలో హీరో రామ్ చరణ్ సందడి
తన కొత్త ల్యాండ్ క్రూయిజర్ లగ్జరీ ఎస్ యూవీ (స్పోర్ట్స్ యుటిలిటీ వెహికల్)కి 1111 ఫ్యాన్సీ నంబరు పొందిన హీరో రామ్ చరణ్, నేటి ఉదయం వాహన రిజిస్ట్రేషన్ కోసం ఖైరతాబాద్ ఆర్టీఏ కార్యాలయానికి వచ్చారు. ఆయన వాహనానికి ఈఈ సిరీస్ లో నంబరు కేటాయించిన అధికారులు టీఎస్ ఈఈ 09 1111 నంబరుతో కారును రిజిస్టర్ చేశారు. రామ్ చరణ్ వచ్చాడని తెలుసుకొని పెద్దఎత్తున అభిమానులు అక్కడికి రావడంతో నిమ్స్ నుంచి ఖైరతాబాద్ జంక్షన్ వరకూ ట్రాఫిక్ నిలిచిపోయింది. ఆర్టీఏ ఉద్యోగులు రామ్ చరణ్ తో ఫొటోలు దిగేందుకు ఉత్సాహం చూపారు.