: మోదీ ప్రతిపక్ష నేతలా వ్యవహరించారు: ఆప్


నరేంద్ర మోదీ తాను దేశానికి ప్రధానినన్న విషయం మరచి, ప్రతిపక్ష నేతలా వ్యవహరించారని ఆమ్ ఆద్మీ పార్టీ అగ్రనేత కుమార్ విశ్వాస్ విమర్శించారు. ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల ప్రచార వేళ ఆ విషయం స్పష్టమైందని అన్నారు. ఓ ప్రధాని తన దేశానికి చెందిన వ్యక్తిని నక్సల్ అని పేర్కొంటే, ప్రజలు హర్షించరని పేర్కొన్నారు. ప్రధాని మోదీని అభిమానించే వాళ్లు ఆ వ్యాఖ్యను అంగీకరించలేదని తెలిపారు. మోదీ... కేజ్రీవాల్ ను అరాచకవాది అని, నక్సల్ అని పేర్కొని, అలాంటి వ్యక్తులు అడవుల్లో ఉండాలని ఎన్నికల ప్రచారం సందర్భంగా వ్యాఖ్యానించడం తెలిసిందే. ఇక, ఆప్ కు మమతా బెనర్జీ, నితీశ్ కుమార్ మద్దతు ఆఫర్ చేయడంపై స్పందిస్తూ, మోదీ వ్యతిరేక ఫ్రంట్ లో చేరే ప్రశ్నేలేదని, తమ పోరాటం అవినీతిపైనే అని, మోదీపై కాదని కుమార్ విశ్వాస్ స్పష్టం చేశారు. మోదీతో తమకేమీ వ్యక్తిగత వైరం లేదని తెలిపారు.

  • Loading...

More Telugu News