: కేజ్రీవాల్ ప్రమాణస్వీకారానికి మోదీ రాలేనని చెప్పారు: మనీశ్ సిసోడియా


ఢిల్లీలోని ప్రధానమంత్రి అధికారిక నివాసం 7, రేస్ కోర్స్ రోడ్ లో నరేంద్రమోదీని ఆమ్ ఆద్మీ పార్టీ కన్వీనర్, కాబోయే ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్, పార్టీ నేత మనీష్ సిసోడియా కలిశారు. దాదాపు 15 నిమిషాల పాటు జరిగిన భేటీలో ఈ నెల 14న రాంలీలా మైదానంలో జరిగే ప్రమాణస్వీకారోత్సవానికి హాజరుకావాలని మోదీని ఆహ్వానించారు. అయితే తనకు ముందుగా ఉన్న కార్యక్రమాల వల్ల రావడానికి సాధ్యపడదని మోదీ చెప్పినట్టు, సమావేశం అనంతరం సిసోడియా మీడియాకు తెలిపారు. కాగా కేంద్రంలో బీజేపీ ప్రభుత్వం పూర్తి మోజారిటీతో ఉండటం, తాజాగా ఢిల్లీలో ఆప్ పూర్తి మెజారిటీతో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయబోతున్న నేపథ్యంలో ఢిల్లీకి పూర్తి రాష్ట్రాధికారం ఇచ్చేందుకు ఇదే మంచి అవకాశమని ప్రధానికి వివరించామన్నారు. స్పందించిన మోదీ ఈ అంశంపై కేంద్రం ఆలోచన చేస్తుందని చెప్పారన్నారు.

  • Loading...

More Telugu News