: ఎన్ని కష్టాలొచ్చినా పార్టీ కార్యకర్తలకు అండగా ఉంటా: చంద్రబాబు
వరంగల్ పర్యటనలో భాగంగా ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు భువనగిరి చేరుకున్నారు. పార్టీ శ్రేణులు ఆయనకు ఘనస్వాగతం పలికారు. ఈ సందర్భంగా బాబు మాట్లాడుతూ, 8 నెలల తరువాత తొలిసారి మిమ్మల్ని కలవడానికి వస్తున్నానన్నారు. ఎన్ని కష్టాలొచ్చినా పార్టీ కార్యకర్తలకు అండగా ఉంటానని భరోసా ఇచ్చారు. కార్యకర్తల త్యాగాలను ఎప్పటికీ మర్చిపోలేమని పేర్కొన్నారు. భౌగోళికంగా విడిపోయినా, మానసికంగా కలసి ఉందామన్న చంద్రబాబు, రెండు రాష్ట్రాలు అభివృద్ధి కావాలన్నదే తన ఆకాంక్షని తెలిపారు. ఎస్ఎల్ బీసీ పూర్తి చేసిన ఘనత తెలుగుదేశం పార్టీదేనని గుర్తుచేశారు. మరికాసేపట్లో హన్మకొండలో నిర్వహించనున్న బహిరంగసభలో ఆయన పాల్గొననున్నారు.