: కేజ్రీవాల్ ప్రమాణ స్వీకారోత్సవానికి మోదీ రావడం లేదా?


ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో ప్రభంజనం సృష్టించిన ఆమ్ ఆద్మీ పార్టీ అధినేత అరవింద్ కేజ్రీవాల్ ఈ నెల 14న సీఎంగా ప్రమాణస్వీకారం చేయనున్నారు. ఢిల్లీలోని రామ్ లీలా మైదాన్ అందుకు ముస్తాబవుతోంది. తన ప్రమాణ స్వీకార కార్యక్రమానికి కేజ్రీవాల్ ప్రముఖులందరినీ ఆహ్వానించారు. ప్రధాని నరేంద్ర మోదీ, కేంద్ర హోం మంత్రి రాజ్ నాథ్ సింగ్, కేంద్ర పట్టణాభివృద్ధి శాఖ మంత్రి వెంకయ్యనాయుడు తదితరులను స్వయంగా ఆహ్వానించారు. కాగా, ప్రధాని మోదీ ఇతర కార్యక్రమాలున్నందున కేజ్రీ ప్రమాణ స్వీకారోత్సవానికి హాజరు కాబోవడంలేదని సమాచారం. అదే రోజున ఎన్సీపీ అధినేత శరద్ పవార్ కు చెందిన ఎడ్యుకేషనల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో బారామతిలో జరిగే ఓ కార్యక్రమానికి మోదీ హాజరవ్వాల్సి ఉంది. ఈ కార్యక్రమం కూడా సరిగ్గా కేజ్రీ ప్రమాణ స్వీకారోత్సవం జరిగే సమయంలోనే జరగనుంది.

  • Loading...

More Telugu News