: ట్విట్టర్ లో మోదీ హవా... ఒబామా, పోప్ ల తర్వాతి స్థానంలో భారత ప్రధాని


సోషల్ మీడియాలో భారత ప్రధాని నరేంద్ర మోదీ దూసుకెళుతున్నారు. గడచిన సార్వత్రిక ఎన్నికల సందర్భంగా సోషల్ మీడియాలో వినూత్న రీతిలో ప్రచారం సాగించి అద్వితీయ విజయాన్ని కైవసం చేసుకున్న మోదీ, ఆ తర్వాత కూడా సామాజిక మాధ్యమాలను వినియోగించడంలో మిగిలినవారి కంటే ముందున్నారు. ప్రస్తుతం ఫేస్ బుక్ లో మోదీకి 2.7 కోట్ల మంది ఫాలోయర్లున్న సంగతి తెలిసిందే. తాజాగా మోదీ ట్విట్టర్ ఖాతాను అనుసరిస్తున్న వారి సంఖ్య కోటి దాటింది. ఈ విషయంలో అమెరికా అధ్యక్షుడు బరాక్ ఒబామా, ప్రపంచ క్రైస్తవుల మత గురువు పోప్ ల తర్వాత మూడో స్థానంలో మోదీ నిలిచారు.

  • Loading...

More Telugu News