: ప్రధాని మోదీతో భేటీ అయిన కేజ్రీవాల్
ఢిల్లీ అసెంబ్లీలో అఖండ విజయం సాధించి, ఈ నెల 14న ముఖ్యమంత్రిగా ప్రమాణస్వీకారం చేయబోతున్న ఆప్ అధినేత అరవింద్ కేజ్రీవాల్ భారత ప్రధాని నరేంద్ర మోదీతో సమావేశమయ్యారు. తన సహచరుడు మనీష్ సిసోడియాతో కలసి రేస్ కోర్స్ రోడ్డులో ఉన్న మోదీ నివాసానికి కేజ్రీవాల్ తన ఇన్నోవా కారులో వెళ్లారు. ఈ సందర్భంగా, శనివారం జరగనున్న ప్రమాణస్వీకార కార్యక్రమానికి నరేంద్ర మోదీని కేజ్రీవాల్ ఆహ్వానించారు. ఇదే సమయంలో ఢిల్లీ అభివృద్ధికి కేంద్ర ప్రభుత్వం వైపు నుంచి పూర్తి సహాయ సహకారాలు అందించాలని మోదీకి కేజ్రీ విన్నవించారు. మరోవైపు, మనీష్ సిసోడియాను డిప్యూటీ సీఎంగా నియమించే అవకాశాలున్నాయన్న వార్తలు ఢిల్లీ పొలిటికల్ సర్కిల్ లో చక్కర్లు కొడుతున్నాయి.