: ‘ఆలయం’ ఆవేదన కలిగించింది: ట్విట్టర్ లో ప్రధాని నరేంద్ర మోదీ
తన పేరిట గుజరాత్ లో కట్టిన గుడిపై ప్రధాని నరేంద్ర మోదీ విస్మయం వ్యక్తం చేశారు. తన పేరిట గుడి కట్టిన విషయం తనను ఆవేదనకు గురి చేసిందని ఆయన పేర్కొన్నారు. ఈ మేరకు ఆయన నేటి ఉదయం ట్విట్టర్ లో తన ఆవేదనను వెళ్లగక్కారు. ‘‘నా పేరిట గుడి కట్టిన విషయం నన్ను దిగ్భ్రాంతికి గురి చేసింది. ఇది భారత సమున్నత సంప్రదాయానికి విరుద్ధం. ఇదా మన సంస్కృతి మనకు నేర్పింది? ఈ విషయం నన్ను వ్యక్తిగతంగా కలచివేసింది. అలాంటి వాటిని మళ్లీ చేయొద్దు. మీకు సమయం ఉంటే, స్వచ్ఛ భారత్ కలను సాకారం చేసేందుకు వినియోగించండి’’ అని మోదీ ట్వీట్ చేశారు.