: హైదరాబాదు-విశాఖ విమానంలో సాంకేతిక లోపం... శంషాబాద్ ఎయిర్ పోర్టులో నిలిపివేత


హైదరాబాదు నుంచి విశాఖ బయలుదేరాల్సిన ఎయిర్ ఇండియాకు చెందిన విమానంలో సాంకేతిక లోపం తలెత్తింది. దీంతో శంషాబాదు అంతర్జాతీయ విమానాశ్రయం నుంచి నేటి ఉదయం 7 గంటలకు బయలుదేరాల్సిన సదరు విమానం నిలిచిపోయింది. సాంకేతిక కారణాలతో విమానం నిలిచిపోవడంతో హైదరాబాదు నుంచి విశాఖకు వెళ్లేందుకు వచ్చిన 179 మంది ప్రయాణికులు రెండు గంటలకు పైగా ఎయిర్ పోర్టులోనే పడిగాపులు గాస్తున్నారు. సాంకేతిక లోపం తలెత్తిన విమానానికి నిపుణులు మరమ్మతులు చేస్తున్నారు. విమానం బయలుదేరే సమయాన్ని ఎయిర్ పోర్టు అధికారులు వెల్లడించకపోవడంతో ప్రయాణికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

  • Loading...

More Telugu News