: ఇక ఢిల్లీలోనూ డిప్యూటీ సీఎం... సిసోడియా పేరు పరిశీలన: చీఫ్ సెక్రటరీతో కేజ్రీవాల్ చర్చలు
తెలుగు రాష్ట్రాలతో పాటు దేశంలోని పలు రాష్ట్రాల్లో డిప్యూటీ సీఎంల ప్రాధాన్యం పెరుగుతోంది. తెలుగు రాష్ట్రాలు తెలంగాణ, ఏపీల్లో ఇద్దరేసి డిప్యూటీ సీఎంలున్నారు. తాజాగా ఢిల్లీలో ఘన విజయం సాధించి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయబోతున్న ఆప్ అధినేత అరవింద్ కేజ్రీవాల్ కూడా డిప్యూటీ సీఎంను నియమించుకునే దిశగా అడుగులేస్తున్నారు. ఈ నెల 14న సీఎంగా పదవీ బాధ్యతలు చేపట్టనున్న కేజ్రీవాల్, నిన్న ఢిల్లీ చీఫ్ సెక్రటరీతో భేటీ అయ్యారు. ఈ సందర్భంగా మంత్రివర్గ కూర్పుపై ఆయన చీఫ్ సెక్రటరీతో చర్చించినట్టు సమాచారం. ఈ చర్చల్లో భాగంగా డిప్యూటీ సీఎం అంశం ప్రస్తావనకు వచ్చిందని, సదరు పదవిలో పార్టీ సీనియర్ నేత మనీష్ సిసోడియాను నియమించాలని కేజ్రీవాల్ వెల్లడించినట్లు విశ్వసనీయ వర్గాల సమాచారం.