: నమ్మండి... నిజం... ముంబై నుంచి హైదరాబాదు కు విమాన టికెట్ రూ.170 మాత్రమే... స్పైస్ జెట్ ఆఫర్!
తగ్గుతూ వచ్చిన ముడి చమురు ధరల పుణ్యమో లేక విమానయాన సంస్థల మధ్య నెలకొన్న తీవ్ర పోటీనో... ప్రయాణికులకు మాత్రం బస్సు, రైలు టికెట్ ధరలకన్నా చౌకగా విమాన టికెట్లు దొరకుతున్నాయి. లోకాస్ట్ ఎయిర్ లైన్ సంస్థ స్పైస్ జెట్ ఏకంగా రూ.170కే ముంబై నుంచి హైదరాబాదుకు టికెట్స్ అమ్ముతోంది. ఆగస్టులో ముంబై వెళ్లి రావడానికి రానూ పోనూ సుమారు రూ.1000కి టికెట్లు దొరకుతున్నాయి. ముంబై వెళ్ళడానికి రూ.857, రావడానికి రూ.170కి టికెట్స్ విక్రయానికి ఉంచింది. ఒక్క ముంబై రూట్ లోనే కాదు, హైదరాబాదు నుంచి తిరుపతికి రూ.775, మధురైకి రూ.1048, ఢిల్లీకి రూ.2033, విజయవాడకు రూ.857లకు టికెట్స్ అందుబాటులో ఉన్నాయి. ఇంకేం ప్రయాణికులకు పండగే కదా! అయితే ఈ టికెట్లను రేపటి లోగా బుక్ చేసుకోవాలి. ప్రయాణ తేదీలను జూలై 1 నుంచి అక్టోబర్ 24 మధ్య నిర్ణయించుకోవచ్చు.