: కేజ్రీవాల్ దెబ్బకు కళ తప్పిన మోదీ వదనం... నిన్నటి గవర్నర్ల భేటీలో ముభావంగా ప్రధాని!


అరవింద్ కేజ్రీవాల్ ‘చీపురు’ గాలికి ప్రధాని నరేంద్ర మోదీ ఉక్కిరిబిక్కిరయ్యారట. ఢిల్లీ ఎన్నికల్లో బీజేపీ ఘోర పరాజయం మోదీని నిశ్చేష్టుడిని చేసింది. రెండు రోజులు గడిచినా ఆయన నోట మాట రావడం లేదు. నిన్న జరిగిన రాష్ట్రాల గవర్నర్ల భేటీలో ఈ విషయం మరింత స్పష్టంగా కనిపించింది. మామూలుగా సమావేశాల్లో చలాకీగా కనిపించే మోదీ, ఆయా సమావేశాలకు హాజరయ్యే వారిని ఆత్మీయంగా పలకరిస్తూ భేటీలకే కొత్త ఉత్తేజాన్ని ఇస్తారు. అయితే ఢిల్లీ ఎన్నికల ఫలితాల మరునాడు నిన్న జరిగిన రాష్ట్రాల గవర్నర్ల సదస్సులో మోదీ ముభావంగా కనిపించారు. సమావేశానికి హాజరైన గవర్నర్లను ఆయన అసలు పలకరించనేలేదట. సమావేశంలో ప్రసంగానికి ఆసక్తి చూపని ఆయన అక్కడ అరగంట పాటు ముళ్లపై ఉన్నట్లే కూర్చున్నారట. రాష్ట్రపతి, గవర్నర్లతో లాంఛనంగా ఓ ఫొటో దిగేసి అక్కడి నుంచి వెళ్లిపోయారు. ఇక నిన్న మోదీ ట్వీట్ల సంఖ్య కూడా బాగా తగ్గింది. కేవలం ఒకే ఒక్క ట్వీట్ తో మోదీ సరిపెట్టారు.

  • Loading...

More Telugu News