: కేసీఆర్ ఇంట్లో అనుకోని అతిథి... 67 బోర్లు వేసి చితికిన రైతు రాంరెడ్డికి ఆత్మీయ ఆతిథ్యం
పొలానికి నీళ్ల కోసం ఒకదాని వెనుక ఒకటిగా 67 బోర్లు వేసి చితికిపోయిన రైతు బైరెడ్డి రాంరెడ్డి. అన్నదాతలు పడే కష్టానికి ప్రతిరూపంగా కనిపించే ఆయన పేరు ‘బోర్ల’ రాంరెడ్డిగా మారింది. ప్రత్యేక రాష్ట్ర ఉద్యమ సమయంలో ప్రతిచోటా ఆయన బాధను కేసీఆర్ పదే పదే చూసిన సంగతి తెలిసిందే. ఇప్పుడాయన కేసీఆర్ ఇంట్లో అతిథిగా మారాడు. ఆయనను తన ఇంటికి పిలిపించుకుని, కలిసి భోజనం చేసిన కేసీఆర్, తన కారులోనే ఎక్కించుకుని సచివాలయానికి తీసుకువచ్చారు. తమ గ్రామానికి రోడ్లు కావాలని, చెరువును బాగు చేయించాలని, నల్లగొండ వ్యవసాయ మార్కెట్ రైతుల అవసరాలకు అనుగుణంగా లేదని రాంరెడ్డి సీఎంకు వివరించారు. వీటిపై స్పందించిన సీఎం ఆ గ్రామంలో రోడ్ల నిర్మాణం చేపట్టాలని అధికారులను ఆదేశించారు.