: ఆ హెలీకాప్టర్ ను కూల్చేశారా? లేక అదే కూలిందా?
జమ్మూకాశ్మీర్ లోని బందీపూర్ లో సైనిక దళానికి చెందిన హెలికాప్టర్ ఒకటి కూలిపోయింది. ఇందులో ప్రయాణిస్తున్న ఇద్దరు మరణించి వుంటారని అనుమానం వ్యక్తమవుతోంది. ప్రమాద సమాచారం అందుకున్న సహాయ బృందాలు రంగంలోకి దిగాయి. అయితే ప్రమాదానికి కారణాలు తెలియలేదు. హెలీకాప్టర్ దానంతట అదే కూలిపోయిందా? లేక ఎవరైనా కూల్చేశారా? అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఆకాశం నుంచి ఏదో వస్తువు కిందకు పడడం చూశానని ప్రత్యక్ష సాక్షి ఒకరు తెలిపారు. కాగా, ఇప్పటి వరకు హెలీకాప్టర్ కూలిన ఘటనపై ప్రభుత్వం ఎలాంటి ప్రకటన చేయకపోవడం గమనార్హం.