: లాడెన్ ను పట్టించింది పాకిస్థానే!: మాజీ ఐఎస్ఐ చీఫ్


అమెరికాను గడగడలాడించిన తీవ్రవాద సంస్థ అల్ ఖైదా నేత, కరడుగట్టిన ఉగ్రవాది ఒసామా బిన్ లాడెన్ ను అమెరికా దళాలకు పాకిస్థానే పట్టించి ఉంటుందని మాజీ ఐఎస్ఐ చీఫ్ జనరల్ అసద్ దురానీ సంచలన వ్యాఖ్యలు చేశారు. 2011లో పాకిస్థాన్ లోని అబొటోబాద్ లోని సైనిక స్థావరానికి కూతవేటు దూరంలోనున్న ఓ ఇంటిపై అమెరికన్ సీల్స్ దాడి చేసి లాడెన్ ను హతమార్చిన సంగతి తెలిసిందే. అమెరికా, పాకిస్థాన్ మధ్య కుదిరిన ఒప్పందం కారణంగానే పాకిస్థాన్ లాడెన్ ను అమెరికాకు పట్టించిందని ఆయన వెల్లడించారు. ఆఫ్ఘనిస్తాన్ సమస్యకు పరిష్కారానికి కుదిరిన ఒప్పందం మేరకే లాడెన్ ఆచూకీని పాక్, అమెరికాకు చెప్పిందని ఆయన ఆల్ జజీరా ఛానెల్ కు ఇచ్చిన ఇంటర్వ్యూలో తెలిపారు. అయితే లాడెన్ నివాసం వివరాలను మాత్రమే పాక్ చెప్పి ఉంటుందని, అంతకు మించి ఆపరేషన్లో ఎలాంటి భాగం పంచుకుని ఉండదని ఆయన అభిప్రాయపడ్డారు. దురానీ 1990 నుంచి 92 వరకు ఐఎస్ఐ చీఫ్ గా పని చేశారు.

  • Loading...

More Telugu News