: నా ఓటమికి కారణం ముస్లిం మతపెద్దలే: కిరణ్ బేడీ
ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికలలో బీజేపీ ముఖ్యమంత్రి అభ్యర్ధిగా బరిలోకి దిగి ఓటమిపాలైన కిరణ్ బేడీ, తన ఓటమికి కారణాల్ని విశ్లేషించుకుంటున్నారు. ముస్లిం మతపెద్దలు తన ఓటమికి కారణమయ్యారని ఆమె ఆరోపించారు. ముస్లింల ఓట్లన్నీ ఆమ్ ఆద్మీ పార్టీకే వేయాలని మతపెద్దలు ఫత్వా జారీ చేశారని, ఆ ఫత్వా కారణంగా ముస్లింలు తనకు ఓటు వేయలేదని ఆమె తెలిపారు. దీనిపై ఎన్నికల సంఘం విచారణ జరిపించాలని బేడీ కోరారు. కాగా, ముస్లిం మతపెద్దలు జారీ చేసిన ఫత్వాను కేజ్రీవాల్ నిర్ద్వంద్వంగా తిరస్కరించిన సంగతి తెలిసిందే.