: పార్టీని లక్ష్యం చేసుకుని ఐటీ శాఖ నోటీసులు పంపదు: బీజేపీ
ఏదో ఒక పార్టీని లక్ష్యం చేసుకుని ఆదాయపన్ను శాఖ నోటీసులు జారీ చేయదని బీజేపీ పేర్కొంది. ఢిల్లీ ఫలితాలు వెలువడి 24 గంటలు కూడా గడవక ముందే ఆమ్ ఆద్మీ పార్టీకి ఆదాయపుపన్ను శాఖ నోటీసులు జారీ చేసింది. పార్టీ నిధుల కింద ఆప్ వివిధ కంపెనీల నుంచి విరాళాలు సేకరించింది. బోగస్ కంపెనీల నుంచి 2 కోట్ల రూపాయలను, నాలుగు విడతలుగా ఆప్ స్వీకరించిందని నోటీసుల్లో ఆదాయపన్ను శాఖ పేర్కొంది. కాగా, తిరుగులేని విజయం సాధించామన్న కక్షతోనే, బీజేపీ నోటీసులు జారీ చేసేలా చేసిందని ఆ పార్టీ నేతలు విమర్శించారు. దీనిపై స్పందించిన బీజేపీ, ఆదాయపన్ను శాఖ కేవలం ఆప్ కే నోటీసులు పంపలేదని, నల్లధనం చలామణీలోకి తీసుకువచ్చే 50 కంపెనీలకు కూడా నోటీసులు జారీ చేసినట్టు తెలిపింది.