: ఆ ఇంట్లో అమ్మాయి పుట్టడానికి 200 ఏళ్లు పట్టింది


ఐదు తరాలుగా అమ్మాయి కావాలన్న వారి కలలు ఎట్టకేలకు నెరవేరాయి. 1809లో ఆ ఇంట చివరి సారిగా ఓ పాపాయి జన్మించింది. తరువాత ఇన్నేళ్లకు పసిపాపాయి ఆ ఇంట్లో పారాడింది. దీంతో ఆ కుటుంబం ఉబ్బితబ్బిబైపోతోంది. లండన్ లోని ల్యారీల కుటుంబంలో ఆడపిల్లలకు ముద్దుముచ్చట్లు బాగా జరుపుతారు. ఎందుకంటే వారింట ఆడపిల్లలు పుట్టడమే మానేశారు. చివరి సారిగా 1809లో గ్రేట్ గ్రేట్ గ్రాండ్ ఆంట్ బెస్సీ జన్మించింది. దాంతో ఆ కుటుంబంలో ఆనందం తాండవించింది. మళ్లీ ఇన్నేళ్లకు పసిపాప జన్మించింది. ఆమెకు మిలా అని ల్యారీ కుటుంబం పేరుపెట్టింది. తరాల తరువాత పాప పుట్టడంతో ఆ కుటుంబం ఆనందానికి పట్టపగ్గాలు లేకుండా ఉన్నాయి. వంశపారంపర్యంగా ఆ కుటుంబంలో అంతా పురుషులే పుట్టేవారు. దీంతో ఆడపిల్ల కోసం ఆ కుటుంబం ఎంతో ఎదురు చూసింది. ఎట్టకేలకు వారి నిరీక్షణకు మిలా తెరదించింది.

  • Loading...

More Telugu News