: నేను పార్టీ మారను: మాజీ ఎంపీ వివేక్


కాంగ్రెస్ పార్టీని వీడేది లేదని పెద్దపల్లి మాజీ ఎంపీ వివేక్ స్పష్టం చేశారు. తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ తో వివేక్ సమావేశమయ్యారు. అనంతరం ఆయన మాట్లాడుతూ, తాను పార్టీ మారేది లేదని అన్నారు. గతంలో వెలువడ్డ వార్తలన్నీ పుకార్లని ఆయన ఖండించారు. కాంగ్రెస్ పార్టీలోనే కొనసాగుతానని ఆయన తెలిపారు. తన తండ్రి వెంకటస్వామి (కాకా) స్మారకం విషయంలో ముఖ్యమంత్రితో చర్చించేందుకు సమావేశమయ్యానని ఆయన వెల్లడించారు. కాగా, వివేక్ పార్టీ మారుతారని అప్పట్లో వార్తలు వెలువడిన సంగతి తెలిసిందే.

  • Loading...

More Telugu News