: అది భారత్ కు సంబంధించిన విషయం: అమెరికా
ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల ఫలితాలపై స్పందించేందుకు అమెరికా పెద్దగా ఆసక్తి చూపలేదు. అది భారత్ అంతర్గత వ్యవహారమని పేర్కొంది. అమెరికా అధికార ప్రతినిధి జెన్ సాకీ మాట్లాడుతూ, ఢిల్లీ ఎన్నికల ఫలితాల అంశం అంతర్జాతీయ వ్యవహారం కాదని అన్నారు. అది భారత్ కు సంబంధించిన విషయమని స్పష్టం చేశారు. భారత్ తో సత్సంబంధాలు కొనసాగించాలని కోరుకుంటున్నామని తెలిపారు. ఢిల్లీ ఎన్నికల ఫలితాలపై స్పందించాలని మీడియా కోరగా సాకీ పైవిధంగా బదులిచ్చారు. ప్రత్యేకించి వ్యాఖ్యానించడానికేమీలేదని అన్నారు.