: జడ్ ప్లస్ భద్రత నిరాకరించిన కేజ్రీవాల్


ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ, కాంగ్రెస్ లను మట్టికరిపించిన ఆమ్ ఆద్మీ పార్టీ అధినేత అరవింద్ కేజ్రీవాల్ జడ్ ప్లస్ భద్రత నిరాకరించారు. ఈ మేరకు పార్టీ వర్గాలు పేర్కొన్నాయి. కేజ్రీవాల్ ఈ మధ్యాహ్నం కేంద్ర హోం మంత్రి రాజ్ నాథ్ సింగ్ ను కలిశారు. ఢిల్లీకి పూర్తి స్థాయి రాష్ట్ర హోదా కల్పించాలని కోరారు. పార్టీ నేత మనీశ్ సిసోడియా మాట్లాడుతూ, కేజ్రీవాల్ ప్రమాణ స్వీకారోత్సవానికి హోం మంత్రిని కూడా ఆహ్వానించామని తెలిపారు.

  • Loading...

More Telugu News