: టీఆర్ఎస్ అడ్డుకుంటామంటోంది... ఎమ్మార్పీఎస్ సహకరించాలి: ఎర్రబెల్లి
ఎస్సీ వర్గీకరణకు టీడీపీ కట్టుబడి ఉందని ఆ పార్టీ నేత ఎర్రబెల్లి దయాకర్ రావు తెలిపారు. బాబు పర్యటన ఏర్పాట్లు సమీక్షించిన సందర్భంగా వరంగల్ లో ఆయన మాట్లాడుతూ, తమ పార్టీ అధినేత చంద్రబాబునాయుడు రేపు వరంగల్ లో జరపతలపెట్టిన పర్యటనకు ఎమ్మార్పీఎస్ సహకరించాలని కోరారు. రైతు కుటుంబాలను ఆదుకునే వరకు ప్రభుత్వంపై తమ పోరాటం సాగుతుందని ఎర్రబెల్లి స్పష్టం చేశారు. కాగా, బాబు పర్యటనను అడ్డుకుని తీరుతామని స్థానిక టీఆర్ఎస్ నేతలు ప్రకటించిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో ఆయన ఎమ్మార్పీఎస్ మద్దతు కోరారు.