: సీఎం హెలీపాడ్ వద్ద ఎమ్మెల్యేకు పరాభవం


శ్రీకాకుళం జిల్లా పలాస టీడీపీ ఎమ్మెల్యే గౌతు శ్యామసుందర్ శివాజీకి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు పర్యటనలో చేదు అనుభవం ఎదురైంది. సీఎం శ్రీకాకుళం జిల్లా పర్యటన సందర్భంగా, ఎమ్మెల్యే హెలిప్యాడ్ వద్దకు చేరుకున్నారు. కాగా, ఆయనను పోలీసులు మధ్యలోనే అడ్డుకున్నారు. హెలీప్యాడ్ వద్దకు అనుమతి లేదని వారు స్పష్టం చేశారు. దీంతో ఎమ్మెల్యే ఆగ్రహం వ్యక్తం చేశారు. తమ పార్టీ అధ్యక్షుడ్ని కలిసేందుకు తనకు అనుమతి ఎలా నిరాకరిస్తారంటూ ఆయన వారిని నిలదీశారు. ఈ సందర్భంగా వారికి, ఎమ్మెల్యేకి మధ్య తీవ్ర వాగ్వాదం చోటుచేసుకుంది. దీంతో మనస్తాపం చెందిన శివాజీ అలిగి సీఎంను కలవకుండానే వెనుదిరిగారు.

  • Loading...

More Telugu News