: ఏపీ, తెలంగాణలో శాసనమండలి ఎన్నికల షెడ్యూల్ విడుదల


ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లో శాసనమండలి ఎన్నికలకు షెడ్యూల్ విడుదలైంది. ఏపీలో ఉభయగోదావరి జిల్లాల, కృష్ణా, గుంటూరు జిల్లాలకు సంబంధించి రెండు ఉపాధ్యాయ నియోజకవర్గాల శాసనమండలి ఎన్నికలకు, తెలంగాణ మహబూబ్ నగర్, హైదరాబాద్, రంగారెడ్డి... వరంగల్, నల్గొండ, ఖమ్మంలో రెండు పట్టభద్రుల నియోజకవర్గాల మండలి ఎన్నికలకు షెడ్యూల్ ఈరోజు విడుదల చేశారు. ఈ నెల 19న ఎమ్మెల్సీ నోటిఫికేషన్ విడుదల, ఈ నెల 26 వరకు నామినేషన్ల స్వీకరణ, మార్చి 2న నామినేషన్ల ఉపసంహరణ, మార్చి 16న పోలింగ్ (ఉదయం 8 గంటల నుంచి సాయంత్రం 4 వరకు), మార్చి 19న ఓట్ల లెక్కింపు ఉంటుంది. ఎమ్మెల్సీ ఎన్నికల షెడ్యూల్ విడుదలతో ఎన్నికల నియమావళి అమలులోకి రానుంది.

  • Loading...

More Telugu News