: మైక్రోసాఫ్ట్ నుంచి మరో చౌక స్మార్ట్ ఫోన్
స్మార్ట్ ఫోన్ల రంగంలో వినియోగదారులకు మరింత చేరువయ్యేందుకు మైక్రోసాఫ్ట్ వివిధ రకాల ప్రయత్నాలు చేస్తోంది. తాజాగా లూమియా 435 పేరుతో ఓ స్మార్ట్ ఫోన్ ను అత్యంత తక్కువ ధరకు మార్కెట్ లో విడుదల చేసింది. భారత్ లో దీని ధర రూ.5,999 మాత్రమే. నాలుగు అంగుళాల స్క్రీన్ ఉన్న ఈ స్మార్ట్ ఫోన్ అత్యంత చీప్ విండోస్ ఫోన్ ఇదే. డ్యూయెల్ సిమ్ సౌకర్యంతో వస్తున్న ఈ ఫోన్ 4800x800 రిజల్యూషన్, 1.2జీహెచ్ జడ్ క్వాడ్-కోర్ స్నాప్ డ్రాగెన్ ఆధారిత 200 ప్రాసెసర్ తో ఉంటుందట. వన్ జీబీ రామ్, అంతర్గత మెమరీ 8జీబీతో అదనపు సౌకర్యాలు.