: అమెరికాలో నెల్లూరు యువతి అనుమానాస్పద మృతి


నెల్లూరుకు చెందిన సాయిసింధు అనే యువతి అమెరికాలోని కాలిఫోర్నియాలో అనుమానాస్పద స్థితిలో మరణించింది. తన భార్య ఆత్మహత్య చేసుకుందని భర్త ఉదయ్ కుమార్ అంటుండగా, అదనపు కట్నం కోసం అల్లుడే చంపాడని సాయిసింధు తల్లిదండ్రులు ఆరోపిస్తున్నారు. ఈ క్రమంలో సాయిసింధు తండ్రి కృష్ణయ్య పోలీసులకు ఫిర్యాదు చేశారు. 2011లో సాయిసింధు వివాహం ఉదయ్ కుమార్ తో జరిగింది. ఉదయ్ కుమార్ ఉన్మాదిలా ప్రవర్తించేవాడని, సాయిసింధును తీవ్రంగా హింసించేవాడని బంధువులు ఆరోపిస్తున్నారు.

  • Loading...

More Telugu News