: పులివెందుల చేరుకున్న వైఎస్ జగన్... పలు కార్యక్రమాలతో బిజీబిజీ


వైకాపా అధినేత జగన్ ఈ ఉదయం పులివెందుల చేరుకున్నారు. పలుకార్యక్రమాల్లో ఆయన బిజీబిజీగా గడపుతున్నారు. స్థానిక విజయా హోమ్స్ లో నూతన గృహ ప్రవేశ కార్యక్రమంలో పాల్గొన్న అనంతరం... తుమ్మలపల్లె, పులివెందుల, మరారిచింతలలో ఇటీవల వివాహం చేసుకున్న జంటలను ఆశీర్వదిస్తారు. ఆ తర్వాత తన ప్రైవేట్ సెక్యూరిటీ గార్డు గంగరాజు వివాహానికి హాజరవుతారు. అనంతరం మసల్ రెడ్డిపల్లెలో రామాలయ విగ్రహ ప్రతిష్ఠలో పాల్గొంటారు. ఈ రోజు రాత్రి వెంకటాద్రి ఎక్స్ ప్రెస్ లో హైదరాబాద్ తిరుగుపయనమవుతారు.

  • Loading...

More Telugu News