: బౌలింగ్ కాంబినేషన్ పై ఎటూ తేల్చుకోలేకపోతున్న ధోనీ


టీమిండియా కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనీకి బౌలింగ్ కూర్పు తలనొప్పిలా పరిణమించింది. వరల్డ్ కప్ ఆరంభం నాటికి ఎవరు ఫిట్ గా ఉంటారో, ఎవరు తప్పుకుంటారో తెలియక అయోమయంలో పడిపోయాడు. యువ పేసర్ భువనేశ్వర్ గాయంపై తాజాగా అనిశ్చితి ఏర్పడింది. భువీ ఫిట్ నెస్ టెస్టులో నెగ్గినా, అతడి మ్యాచ్ సన్నద్ధతపై సందేహాలు మాత్రం తొలగిపోలేదు. అందుకే అతడికి బ్యాకప్ గా ధవళ్ కులకర్ణిని ఆస్ట్రేలియాలో ఉండాలని టీమిండియా మేనేజ్ మెంట్ కోరింది. దీంతో, పాక్ తో ప్రతిష్ఠాత్మక మ్యాచ్ సహా, గ్రూప్ మ్యాచ్ లకు బౌలింగ్ కాంబినేషన్లు ఎలా సెట్ చేయాలన్న అంశంపై ధోనీ బుర్ర బద్దలు కొట్టుకుంటున్నాడు. అయితే, వేచి చూస్తామని, పిచ్ పరిస్థితులను దృష్టిలో ఉంచుకుని బౌలింగ్ కూర్పు ఉంటుందని మీడియాతో మాట్లాడుతూ అన్నాడు. ఇక, ఆఫ్ఘనిస్థాన్ తో వార్మప్ మ్యాచ్ సంతృప్తి కలిగించిందని చెప్పాడు. అన్ని రంగాల్లో రాణించామని తెలిపాడు.

  • Loading...

More Telugu News