: డీడీలో ప్రపంచకప్ మ్యాచ్ లను ప్రసారం చేయాల్సిందే... స్టార్, బీసీసీఐకి సుప్రీం షాక్


ఈ నెల 14 నుంచి జరగనున్న ఐసీసీ క్రికెట్ ప్రపంచకప్ మ్యాచ్ లు దూరదర్శన్ లో ప్రత్యక్షప్రసారం కానున్నాయి. ఈ మేరకు దేశ అత్యున్నత న్యాయస్థానం సుప్రీంకోర్టు ఆదేశాలు జారీ చేసింది. డీడీలో మ్యాచ్ లను ప్రత్యక్ష ప్రసారం చేస్తే, కేబుల్ టీవీ ఆపరేటర్లు ఉచితంగా ఫీడ్ పొందుతారని... అందువల్ల తాము ఆర్థికంగా చాలా నష్టపోతామని స్టార్ టీవీ నెట్ వర్క్, బీసీసీఐ వాదించాయి. వీరి వాదనలను సుప్రీంకోర్టు కొట్టి వేసింది. మారుమూల ప్రాంతాల్లోని ప్రజలు సైతం మ్యాచ్ లను వీక్షించాలంటే డీడీనే ఆధారమని ఈ సందర్భంగా కోర్టు తెలిపింది. ఎట్టి పరిస్థితుల్లో డీడీలో మ్యాచ్ లను ప్రత్యక్ష ప్రసారం చేయాల్సిందేనని ఆదేశించింది.

  • Loading...

More Telugu News