: ఎంఎంటీఎస్ మహిళా బోగీల్లో ఆకతాయిలు... 50 మంది యువకులు, పది మంది హిజ్రాల అరెస్ట్


హైదరాబాదు ఎంఎంటీఎస్ రైళ్లలో ఆకతాయిల ఆగడాలు నానాటికీ పెరిగిపోతున్నాయి. రైళ్లలోని మహిళల బోగీల్లోకి ప్రవేశిస్తున్న ఆకతాయిల సంఖ్య పెరిగిపోయింది. అంతేగాక, పురుషుల బోగీల్లో హిజ్రాల వెకిలి చేష్టలూ పెరిగిపోయాయి. దీంతో, రైల్వే ప్రొటెక్షన్ ఫోర్స్ (ఆర్పీఎఫ్) పోలీసులకు ఫిర్యాదులు వెల్లువెత్తుతున్నాయి. ప్రయాణికుల ఫిర్యాదులతో రంగంలోకి దిగిన పోలీసులు నేటి ఉదయం పలు రైళ్లతో పాటు రైల్వే స్టేషన్లలోనూ సోదాలు నిర్వహించారు. ఈ సందర్భంగా మహిళా బోగీల్లో ప్రవేశించిన 50 మంది యువకులతో పాటు పురుషుల బోగీల్లో వెకిలిచేష్టలకు దిగిన పదిమంది హిజ్రాలను అదుపులోకి తీసుకున్నారు. పనిలో పనిగా టికెట్లు లేకుండా ప్రయాణిస్తున్న మరో 50 మందిని అరెస్ట్ చేశారు.

  • Loading...

More Telugu News