: కేజ్రీవాల్ స్ఫూర్తితో ఏపీలో కొత్త పార్టీ... జూలై 26న ఆవిర్భవించనున్న నవ్యాంధ్ర పార్టీ!
ఢిల్లీ ఎన్నికల్లో సామాజిక ఉద్యమకర్త అరవింద్ కేజ్రీవాల్ నేతృత్వంలో సత్తా చాటిన ఆమ్ ఆద్మీ పార్టీ మరెంతో మందికి స్ఫూర్తిగా నిలవనుంది. ఇప్పటికే ప్రాంతీయ, జాతీయ స్థాయిల్లోనే కాక విశ్వవ్యాప్తంగానూ ఆసక్తి రేపుతున్న ఆ పార్టీ స్ఫూర్తితో ఆంధ్రప్రదేశ్ లో కొత్త రాజకీయ పార్టీ పుట్టుకొస్తోంది. ఆంధ్రప్రదేశ్ దళిత మహాసభ వ్వవస్థాపక ప్రధాన కార్యదర్శి కత్తి పద్మారావు ఆధ్వర్యంలో ‘నవ్యాంధ్ర పార్టీ’ పేరిట కొత్త పార్టీ ఆవిర్భవించనుంది. ఈ పార్టీ ఆవిర్భావానికి జూలై 26ను ముహూర్తంగా నిర్ణయించామని కత్తి పద్మారావు పేర్కొన్నారు. నిన్న గుంటూరు జిల్లా పొన్నూరులో నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన ఈ మేరకు ప్రకటించారు.