: పోలీస్ స్టేషన్ లో దొంగ ఆత్మహత్యాయత్నం... గుట్టుగా ఆసుపత్రికి తరలించిన పోలీసులు
చోరీ కేసుకు సంబంధించిన విచారణ సందర్భంగా పోలీసులు పెడుతున్న చిత్రహింసలను భరించలేక ఓ దొంగ పోలీస్ స్టేషన్ లోనే ఆత్మహత్యాయత్నం చేశాడు. కృష్ణా జిల్లా కేంద్రం మచిలీపట్నం పరిధిలోని చింతలపూడి పోలీస్ స్టేషన్ లో రాత్రి జరిగిన ఈ ఘటనలో కార్ల చోరీ నిందితుడు గోవిందరాజు గొంతు కోసుకున్నాడు. దీంతో, అతడికి తీవ్ర రక్తస్రావమైంది. పోలీస్ స్టేషన్ లోనే నిందితుడు ఆత్మహత్యాయత్నం చేయడంతో కంగుతిన్న పోలీసులు గుట్టుచప్పుడు కాకుండా అతడిని చికిత్స నిమిత్తం ఆసుపత్రికి తరలించారు.