: గుంటూరు జిల్లాలో దోపిడీ దొంగల బీభత్సం... ఆటో డ్రైవర్ పై దాడి, నగలు అపహరణ
గుంటూరు జిల్లాలో దోపిడీ దొంగలు స్వైర విహారం చేస్తున్నారు. ఇటీవల జిల్లావ్యాప్తంగా దారి దోపిడీలకు తెగబడుతున్న దుండగులు జిల్లా పోలీసులకు కంటి మీద కునుకు లేకుండా చేస్తున్నారు. తాజాగా, ఆటో డ్రైవర్ పై దాడి చేసిన దోపిడీ దొంగలు నగలు, నగదు అపహరించారు. జిల్లాలోని సత్తెనపల్లి మండలం గుడిపూడిలో చోటుచేసుకున్న ఈ ఘటనలో ఆటో డ్రైవర్ హనుమంతరావు తీవ్ర గాయాలపాలయ్యాడు. దీంతో, అతడిని చికిత్స నిమిత్తం స్థానికులు ఆసుపత్రికి తరలించారు. అతడి పరిస్థితి విషమంగా ఉన్నట్లు సమాచారం.