: ఆప్ విజయం ప్రభంజనమే!: కేజ్రీవాల్ ను ఆకాశానికెత్తేసిన విదేశీ మీడియా!


ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో ఆమ్ ఆద్మీ పార్టీ సాధించిన చారిత్రాత్మక విజయంపై ప్రశంసల జల్లు కురుస్తోంది. ఆప్ విజయతీరాలకు చేరిన తీరు, ఇందుకోసం ఆ పార్టీ అధినేత అరవింద్ కేజ్రీవాల్ రూపొందించిన ప్రణాళికలు, ఎన్నికల్లో నిర్భయంగా ముందుకెళ్లిన తీరు, బీజేపీపై చేసిన ప్రచార దాడి, అదే సమయంలో తమపై బీజేపీ చేసిన దాడులను తప్పికొట్టిన వైనం తదితరాలపై ఆసక్తికర కథనాలు వెల్లువెత్తాయి. జాతీయ మీడియాతో పాటు ప్రాంతీయ వార్తా ఛానెళ్లు, పత్రికల్లోనూ ఆప్ విజయదుందుభికి సంబంధించిన కథనాలే ప్రసారమయ్యాయి. దేశ రాజధానిలో సామాన్యుడిగా బరిలోకి దిగిన కేజ్రీవాల్ సాధించిన ఈ విజయంపై విదేశీ మీడియా కూడా పలు ఆసక్తికర కథనాలను రాసింది. మొత్తం 70 సీట్లలో 67 సీట్లను కైవసం చేసుకున్న ఆప్, కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీకి కేవలం మూడు సీట్లను మాత్రమే వదిలిందని, ఈ విజయం ఓ ప్రభంజనమేనని పలు విదేశీ పత్రికలు కేజ్రీవాల్ ను ఆకాశానికెత్తేశాయి.

  • Loading...

More Telugu News