: కుక్క మొరిగిందా, మూడువేల డాలర్లు చెల్లించండి: న్యాయస్థానం


నిర్దేశించిన సమయాల్లో మాత్రమే మొరగాలని ఆ శునకాన్ని కోర్టు ఆదేశించిన విచిత్రమైన సంఘటన క్రొయేషియాలో చోటుచేసుకుంది. క్రొయేషియా దేశంలోని పెరెజ్ పట్టణానికి సమీపంలోని ఓ గ్రామంలో ఆంటన్ సిమునోవిక్‌ అనే వ్యక్తి ఓ కుక్కను పెంచుకుంటున్నాడు. దాని పేరు మెడో(3). రాత్రి వేళల్లో అది అకారణంగా మొరుగుతూ చుట్టుపక్కల వారిని విసిగించడం మొదలు పెట్టింది. దీంతో మెడో కారణంగా చాలా ఇబ్బంది పడుతున్నానని, కనీసం నిద్ర కూడా పోలేకపోతున్నానని పొరుగింటాయన సిమునోవిక్‌ కు ఫిర్యాదు చేశాడు. అతని బాధను అర్థం చేసుకున్న మెడో యజమాని దానిని అరవకుండా చేసేందుకు శతథా ప్రయత్నించి విఫలమయ్యాడు. దీంతో బాధితుడు పెరెజ్ లోని కోర్టును ఆశ్రయించాడు. అతని ఆవేదన అర్థం చేసుకున్న న్యాయమూర్తి, రాత్రి 8 గంటల నుంచి ఉదయం 8 గంటల వరకు మెడో తన గదిలోనే ఉండాలని, ఆరు బయట సంచరించరాదని, మొరగకూడదని ఆదేశించారు. ఆదేశాలు ధిక్కరిస్తే మెడో యజమాని మూడు వేల డాలర్లు జరిమానాగా చెల్లించాల్సి ఉంటుందని తీర్పు ఇచ్చారు.

  • Loading...

More Telugu News