: కేజ్రీవాల్ కు శుభాకాంక్షలు చెప్పిన రాజ్ నాథ్ సింగ్


ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో అఖండ విజయం సాధించిన ఆమ్ ఆద్మీ పార్టీ అధినేత అరవింద్ కేజ్రీవాల్ ను కేంద్ర హోం మంత్రి రాజ్ నాథ్ సింగ్ ఫోన్ చేసి అభినందించారు. ఢిల్లీ అభివృద్ధికి పూర్తి సహకారం అందిస్తామని ఆయన కేజ్రీవాల్ కు తెలిపారు. కాగా, ఎన్నికల ఫలితాలు వెలువడిన వెంటనే ప్రధాని మోదీ ఫోన్ చేసి అభినందనలు తెలిపిన విషయం తెలిసిందే. అలాగే కాంగ్రెస్ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీ కూడా అభినందించిన సంగతి తెలిసిందే.

  • Loading...

More Telugu News