: అవినీతిని అరికట్టే ప్రభుత్వాలనే ప్రజలు గౌరవిస్తారు: బాన్ కీ మూన్
అవినీతిని అరికట్టే ప్రభుత్వాలనే ప్రజలు గౌరవిస్తారని ఐక్యరాజ్యసమితి ప్రధాన కార్యదర్శి బాన్ కీ మూన్ అన్నారు. దుబాయ్ లోని ఓ కార్యక్రమంలో పాల్గొన్న ఆయన మాట్లాడుతూ, అభివృద్ధి సాధించాలంటే ప్రభుత్వాలు పారదర్శకతకు పెద్దపీట వేయాలని అన్నారు. ప్రైవేటు, ప్రభుత్వ రంగ సంస్థల మధ్య సహకారం పెంచాలని ఆయన సూచించారు. అందరికీ సమాన న్యాయం, హక్కులు కల్పించే ప్రభుత్వాలకే ప్రజలు అత్యంత గౌరవం ఇస్తారని ఆయన అభిప్రాయపడ్డారు.